నాని 'వ్యూహం'లో సమంత

SMTV Desk 2019-04-02 13:40:27  samantha akkineni, nani

పెళ్లి తర్వాత సాధారణంగా అయితే మార్కెట్ పడిపోతుంది కాని సమంతకు మాత్రం సినిమా సినిమాకు క్రేజ్ డబుల్ అవుతుంది. చైతుతో మ్యారేజ్ తర్వాత సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ వస్తున్న సమంత యువ హీరోయిన్స్ కు గట్టి పోటీ ఇస్తుంది. లేటెస్ట్ గా సమంత నటించిన తమిళ సినిమా సూపర్ డీలక్స్ రిలీజ్ అవగా ఈ శుక్రవారం తెలుగులో మజిలి రిలీజ్ అవుతుంది. చైతు, సమంత పెళ్లి తర్వాత నటించిన మజిలీ సినిమాకు క్రేజ్ పెరిగింది.

ఓ పక్క నందిని రెడ్డి డైరక్షన్ లో సమంత ఓ బేబీ సినిమా చేస్తుంది. అదికాకుండా లేటెస్ట్ గా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో నాని, సుధీర్ బాబు కలిసి చేస్తున్న సినిమాలో కూడా సమంత హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందట. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా వ్యూహం అని పెట్టబోతున్నారట. నాని నెగటివ్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ గా కనిపిస్తారట. నాని సమంత ఇదవరకు ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాల్లో నటించారు. వ్యూహం కోసం వీరిద్దరు మళ్లీ కలిసి పనిచేస్తుండటం విశేషం. మరి మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ వ్యూహం కథ కామీషు ఏంటో త్వరలో తెలుస్తుంది.