ఇది ఐపిఎల్‌లోనే రికార్డు

SMTV Desk 2019-04-02 10:49:00  IPL,

ఐపిఎల్ – 2019లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడ్డాయి. ఢిల్లీ జట్టు మీద పంజాబ్ జట్టు 14 పరుగుల తేడాతో గెలుపొందింది. తేలికగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఢిల్లీ జట్టు చేజార్చుకుంది. చివరి 24 బంతుల్లో 30 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. పైగా చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. ఈ స్థితిలో కచ్చితంగా గెలవడం ఖాయం. కానీ ఓడిపోయింది. ఆలౌటై 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఢిల్లీ బ్యాటింగ్‌లో ఐదు డకౌట్లు ఉండటం విశేషం. ఇది ఐపిఎల్‌లోనే రికార్డు. ఇప్పటి వరకూ జరిగిన ఐపిఎల్‌ సీజన్లలో ఇది రెండో అత్యధిక డకౌట్ల ఇన్నింగ్స్‌గా నిలిచింది.

ముందుగా పంజాబ్ బౌలర్ శ్యామ్ కరన్ గురించి చెప్పుకోవాలి. ఇతను 2.2 ఓవర్లు మాత్రమే వేసి 11 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉంది. చివరి మూడు బంతుల్లో వరుసగా హర్షల్ పటేల్, కగిసో రబాడా, సందీప్ లమిచనే‌లను పడగొట్టాడు. ఆ మూడు వికెట్లు కూడా డకౌట్లే. ఈ ముగ్గురితోపాటు ఢిల్లీ ఓపెనర్ పృధ్వి షాను క్యాచ్ రూపంలో, క్రిస్ మోరిస్‌ను రనౌట్ రూపంలో పంజాబ్ కెప్టెన్ అశ్విన్ సున్నా పరుగుల వద్దే ఔట్ చేశాడు.

ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక డకౌట్లు 2011లో నమోదయ్యాయి. ఆ ఏడాదిలో కోచి టస్కర్స్ కేరళ, డెక్కన్ ఛార్జర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అది జరిగింది. ఆ ఏడాది తర్వాత మళ్లీ ఒకే ఇన్నింగ్స్‌లో అధిక డకౌట్లు అయ్యింది ఈ మ్యాచ్‌లోనే కావడం విశేషం.