KXIP vs DC : టాస్ గెలిచి ఫీల్డింగ్ కు ఢిల్లీ

SMTV Desk 2019-04-01 20:44:49  kxip vs dc, ipl 2019

మొహాలీ : ఐపిఎల్‌లో భాగంగా సోమవారం మొహాలీలో ఢిల్లీ క్యాపిటల్‌స కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచినా ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌లాడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.. కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడి.. రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్‌పై గెలుపొందింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా మూడు మ్యాచ్‌లాడగా.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి.. ముంబయి, కోల్‌కతాపై విజయం సాధించింది. రెండు జట్లలోనూ హిట్లర్లకి కొదవలేకపోవడంతో.. ఈరోజు మ్యాచ్ ఆసక్తికరంగా జరగనుంది. ఢిల్లీ తుది జట్టులో ఒక మార్పు జరిగింది. స్పిన్నర్ అమిత్ మిశ్రాపై వేటు వేసిన శ్రేయాస్.. ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్‌ని జట్టులోకి తీసుకున్నాడు. మరోవైపు పంజాబ్ జట్టు.. ఈ మ్యాచ్‌కి ఓపెనర్‌ క్రిస్‌గేల్‌కు రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


Kings XI Punjab (Playing XI): Lokesh Rahul(w), Mayank Agarwal, David Miller, Sarfaraz Khan, Mandeep Singh, Hardus Viljoen, Sam Curran, Ravichandran Ashwin(c), Murugan Ashwin, Mohammed Shami, Mujeeb Ur Rahman.

Delhi Capitals (Playing XI): Prithvi Shaw, Shikhar Dhawan, Shreyas Iyer(c), Rishabh Pant(w), Colin Ingram, Hanuma Vihari, Harshal Patel, Chris Morris, Sandeep Lamichhane, Kagiso Rabada, Avesh Khan.