‘దొరసాని’ ఫస్ట్ లుక్

SMTV Desk 2019-04-01 20:43:36  dorasani,dorasani first look

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ అనే ఓ మంచి ప్రేమకథా చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆనంద్ కు జోడీగా జీవిత రాజశేఖర్ కూతురు శివాత్మిక నటిస్తుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోన్న మహేంద్ర గతంలో షార్ట్ ఫిల్మ్స్‌‌, యాడ్స్ చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మహేంద్ర.. ఇప్పుడు ‘దొరసాని’ చిత్రాన్ని కూడా పూర్తి తెలంగాణ నేపథ్యంలోనే తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ తర్వలోనే విడుదల కానుంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో యాష్ రంగినేని , మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.