చంద్రబాబును స్టిక్టర్ బాబు అంటూ ఎద్దేవా చేసిన మోదీ

SMTV Desk 2019-04-01 20:42:18  chandrababu, modi

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు వర్షం కురిపించారు ప్రధాని నరేంద్రమోదీ. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బహిరంగ సభలో మాట్లాడిన మోదీ.. చంద్రబాబును యూటర్న్ , స్టిక్కర్ బాబుగా సంభోంధించారు. అంతేకాకుండా ఏపీలో చంద్రబాబు బాహుబలి సినిమాలో భల్లాలదేవ పాత్ర పోషిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. హెరిటేజ్ బాబు అని కూడా చంద్రబాబు గురించి మాట్లాడుతూ ప్రస్తావించారు ప్రధాని. ధర్మాన్ని అణచివేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. పోలవరం పనులు నాలుగేళ్లుగా ఆగుతూ వస్తున్నాయన్నారు. దీనికి ఏపీలో అధికారం చేపట్టిన గత ప్రభుత్వాలే కారణమన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలన్న ఉద్దేశం గత ప్రభుత్వాలకు లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు ఏపీకి ఏడువేల కోట్లు నిధులు కేటాయించామన్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు పూర్తిచేయాలనుకోవడం లేదన్నారు. కేంద్ర నిధుల్ని సరైన రీతిలోలో టీడీపీ ఖర్చు పెట్టడం లేదన్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయాలు ఎప్పటికప్పుడు పెంచేస్తున్నారని ఆరోపించారు. యూటర్న్ బాబుకు పోలవరం ప్రాజెక్టు ఏటీఎం మెషిన్‌లా మారిందన్నారు. అందులో నుంచి డబ్బులు తీసుకొని ఖజానాకు తరలించుకుంటున్నారని విమర్శించారు.

ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అనేకమంది ప్రజలకు తాగు, సాగునీరు అందుతుందన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం పూర్తికాకుండా అద్దం పడుతుందన్నారు. యూటర్న్ బాబు ఎవరికి మేలు చేయాలని చూస్తున్నారో ? అందరికి తెలుసన్నారు. ఏపీ, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని గెలిపించి... ఇలాంటి దేశద్రోహుల్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు ప్రధాని. రైతుల గురించి చంద్రబాబుకు ఆలోచించే తీరికే లేదన్నారు. కేంద్ర పథకాలకు చంద్రబాబు తన స్టికర్ అంటించుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబును స్టిక్టర్ బాబు అంటూ ఎద్దేవా చేశారు. ప్రతీ కేంద్రం పథకంపై వారి స్టిక్కర్ తగిలించేసుకుంటున్నారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వానికి ఎన్డీయే పూర్తి సహకారం అందిస్తోందన్నారు మోదీ. నిజాయితీగా అందరూ పన్ను చెల్లించడం వల్లే ఏపీలో అభివృద్ధి జరుగుతుందన్నారు.