టెక్నాలజీ ఎఫెక్ట్...4.5 కోట్ల ఉద్యోగాలకు చెక్

SMTV Desk 2019-04-01 20:41:19  digital technology, digital india, unemployment, employment, unemployment due to technological advancement

టెక్నాలజీ వల్ల ఎంత ఉపయోగం ఉందో అంత నష్టం కూడా ఉంది. టెక్నాలజీ పెరిగేకొద్దీ పాత వస్తువులతో పాటు ‘పాత ఉద్యోగులు’ కూడా మూలనపడుతున్నారు. టెక్నాలజీ వల్ల, ముఖ్యంగా డిటిటల్, రోబోటిక్స్, కృత్రిమ మేధ కారణంగా వచ్చే ఆరేళ్లలో 4.5 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారని మెకిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ హెచ్చరించింది. డిజిటల్ ఇండియా ప్రభావంపై దృష్టి కేంద్రీకరించి పొందుపరచిన నివేదిక ప్రకారం.. 2025 నాటికి ఐటీ, కమ్యూనికేషన్ రంగాల్లో డిజిటల్ ఇండియా వల్ల 6 కోట్ల కొత్త ఉద్యోగాలు రావొచ్చు. అయితే భారీగా ఉద్యోగాలకు కోత కూడా పడనుంది. 4.5 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతారు. వారు తాము పనిచేసే రంగాల్లో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, లేకపోతే ఇతర రంగాలకు మారడం వల్ల సమస్య నుంచి గట్టెక్కవచ్చు.. టెక్నాలజీ పెరుగుదల వల్ల కొన్ని సానుకూల అంశాలు కూడా తోడవుతాయి. ప్రపంచవ్యాప్తంగా 2025 నాటికి జీడీపీలో ఐటీ సాఫ్ట్‌వేర్ ఎగుమతుల విలువ 2025 రూ.30 లక్షల కోట్లకు చేరుతుంది.