మహిళతో సెక్స్ కావాలి అని అడిగిన స్విగ్గీ డెలివరీ బాయ్....పరిహారంగా రూ.200 కూపన్

SMTV Desk 2019-04-01 20:34:42  swiggy, food delivery company, delivery boys, sexual harassment

బెంగళూరు : ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వివాదాల్లో చిక్కుకుంది. బెంగుళూరులోని ఆ సంస్థ డెలివరీ బాయ్ ఓ మహిళలతో ప్రవర్తించిన తీరును పట్ల ఆ సంస్థ చిక్కుల్లో పడింది. పూర్తి వివరాల ప్రకారం...బెంగళూరుకు చెందిన ఓ మహిళ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసింది. పార్శిల్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ ఆమెను లైంగికంగా వేధించాడు. మొదట మెల్లిగా ఏదో అన్నాడు. ఆమెకు అర్థంకాక మళ్లీ చెప్పమని అడగడంతో సెక్స్ కావాలని అన్నాడు. దీంతో ఆమె షాకైంది. తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల్ని ఫేస్‌బుక్ పోస్టులో వివరించింది. స్విగ్గీ యాజమాన్యానికి కంప్లైంట్ చేసింది. అయితే దీనిపై స్పందించిన స్విగ్గీ సారీ చెబుతూ రిప్లై ఇచ్చింది. అంతేకాదు... నష్టపరిహారం కింద రూ.200 కూపన్ పంపింది. డెలివరీ బాయ్‌పై చర్యలు తీసుకుంటామని సర్దిచెప్పింది.