కోహ్లీపై ఆగని నెటిజన్ల విమర్శల వర్షం

SMTV Desk 2019-04-01 20:32:49  rcb, ipl, ipl 2019, virat kohli, srh, mi, csk

ఐపీఎల్ సీజన్లన్నింటిలో ఒక్కసారి కూడా ట్రోఫీని సొంతం చేసుకొని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎలాగైనా ఈ సీజన్లో ట్రోఫీని సొంతం చేసుకోవాలని కసితో ఉంది. కాని ఈ సీజన్లో మొదటి మ్యాచ్ నుండి బెంగుళూరుకి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటికి బెంగుళూరు మూడు మ్యాచ్ లు ఆడింది. కాని ఏ ఒక్క మ్యాచ్ లో కూడా కోహ్లీ సేన నెగ్గలేకపోయింది. ఇక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్‌లు విజృంభించడంతో జట్టు స్కోరు 231పరుగులకు చేరింది. చేధనకు దిగిన ప్లేయర్లలో ఓపెనర్ 11 పరుగులు మినహాయించి శివం దూబె వరకూ అంతా సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అయ్యారు. ఆ పరిస్థితుల్లో గ్రాండ్ హోమ్ క్రీజులోకి వచ్చి జట్టు పరువుపోకుండా కాపాడాడు. ఈ ప్రదర్శన పట్ల కెప్టెన్ విరాట్ కోహ్లీని తీవ్రంగా విమర్శిస్తున్నారు నెటిజన్లు.