మా ఇంటి మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఆడబిడ్డ పెళ్లికి రూ. లక్ష

SMTV Desk 2019-04-01 20:31:39  pawan kalyan, janasena

ఎన్నికల సమయంలో జనసేనానీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల వరాలు కురిపిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో. .ప్రజలకు వివరిస్తున్నారు పవన్. ఇంటర్ స్టూడెంట్స్‌కి ల్యాప్ టాప్‌లు ఇస్తామని..రైతులకు పెన్షన్ కింద రూ. 5వేలు..మా ఇంటి మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఆడబిడ్డ పెళ్లికి రూ. లక్ష..చీర - సారె పథకం కింద మరో రూ. 10, 116 ఇస్తామని వెల్లడించారు. మహిళలు 10 నుండి 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు.

సోమవారం తాడేపల్లిగూడెంలో ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొని టీడీపీ..వైసీపీలపై విమర్శల బాణాలు సంధించారు. ఉనికిని చాటు కోవడం కోసం..మార్పు రావాలని కోరుకొనే వ్యక్తి అన్నారు. టిడిపిని విమర్శలు చేయడం లేదని అంటున్నారు కానీ 2018లోనే టీడీపీ ఓడిపోయిందన్నారు. సైకిల్ ఛైన్ తెగిపోయిన పార్టీ..స్టాండ్ వేసుకుని తొక్కుకోవాలని ఎద్దేవా చేశారు. టీడీపీ పార్ట్ నర్ అంటూ జగన్ విమర్శలు చేస్తున్నారని..అమిత్ షా పార్ట్ నర్ జగన్ అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడలేని వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు..చట్ట సభలకు వెళ్లలేని వ్యక్తి ఏం పాలిస్తాడని విమర్శలు చేశారు.