ప్రధానమంత్రి ‘‘మూర్ఖుడు, చదువురాని వాడు...’’

SMTV Desk 2019-04-01 19:48:19  modi,

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు మజీద్ మెమొన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి ‘‘మూర్ఖుడు, చదువురాని వాడు...’’ అంటూ మాటల దాడికి దిగారు. ప్రధానిగా మళ్లీ ఎన్నిక కావాలని నరేంద్రమోదీ కోరుకోవడంపై జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో మజీద్ ఈ మేరకు స్పందించారు. ‘‘ప్రధానమంత్రి చదువురాని మూర్ఖుడిలా మాట్లాడుతున్నారు. ఆయన మాటలు రోడ్డు పక్కన పోయేవాడిలా ఉన్నాయి. అంత గొప్ప పదవిలో ఉన్న ఆయన... అది రాజ్యాంగ పదవి అని తెలుసుకోవాలి. అలాంటి రాజ్యాంగ పదవి రోడ్లపైన దొరికేది కాదని గుర్తుంచుకోవాలి...’’ అంటూ విరుచుకుపడ్డారు.

పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగా దేశంలోని 543 మంది ప్రజాప్రతినిధులు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకునే మాదిరిగా భారత ఓటర్లు తమ ప్రధానిని నేరుగా ఎన్నుకునే అవకాశం లేదని మజీద్ పేర్కొన్నారు. మజీద్ మీనన్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్‌లో పోటీచేయాలంటూ ఇటీవల బీజేపీ నేతలు వ్యాఖ్యానించడంపైనా మజీద్ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ‘‘బీజేపీ నేపాల్‌లో పోటీచేయాలి. చౌకీదార్లకు ఈ హిమాలయ దేశంలో తప్పక విజయం దక్కుతుంది...’’ అని ఆయన వ్యాఖ్యానించారు.