ఐసీసీ కొత్త సీఈవో మనూ సాహ్ని

SMTV Desk 2019-04-01 18:20:12  icc, icc ceo, Manu Sawhney, new chief executive officer

న్యూఢిల్లీ : ఐసీసీ సీఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు మీడియా రంగంలో అగ్ర స్థానంలో ఉన్న మనూ సాహ్ని సిద్దం అయ్యారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సీఈవోగా ప్రస్తుతమున్న డేవ్ రిచర్డ్‌సన్ పదవీ బాధ్యతలు వరల్డ్ కప్ అనంతరం జూలై నాటికి ముగియనున్నాయి. ఈఎస్పీఎన్ స్టార్ స్టోర్ట్స్ ఎండీ సాహ్ని ఆరు వారాలనుంచి విధులలో రిచర్డ్‌సన్‌తో పాటు కలిసి పనిచేస్తున్నారు. అపెక్స్ బాడీ చైర్మన్ శశాంక్ మనోహర్.. నామినేషన్ కమిటీ ఈ నియామక ప్రక్రియను నిర్వహించింది. సాహ్ని 17ఏళ్లుగా ఈఎస్పీఎన్ స్టార్ స్పోర్ట్స్‌కు సేవలందిస్తున్నారు. దీంతో పాటు 2007-2015వరకూ ప్రపంచ వ్యాప్త ప్రసారాల్లోనూ భాగస్వామిగా పనిచేస్తున్నారు. అంతేగాక, ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ లిమిటెడ్‌లో నాన్ ఎక్సిక్యూటివ్ డైరక్టర్ అండ్ మెంబర్‌లో సభ్యునిగానూ ఉన్నారు. ఈ సందర్భంగా సాహ్ని మాట్లాడుతూ.. డేవిడ్ నుంచి ఈ బాధ్యతలను అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏడేళ్లుగా స్పోర్ట్స్‌ను చక్కగా నడిపిస్తున్నాడు. అవకాశాలను అందిపుచ్చుకోవడం పట్ల చాలా ఉత్సాహంగా ఉంది. పార్ట్‌నర్స్.. సిబ్బందితో కలిసి ఎప్పుడు పనిచేస్తానా అని కుతూహలంగా ఎదురుచూస్తున్నా అని పేర్కొన్నాడు.