అవి జెఎఫ్‌-17 విమానాలే

SMTV Desk 2019-04-01 18:19:22  pakistan, india, indian airforce, pakistan army, indian army, jf-17 jet, f-16 jet

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్ ఉగ్రాదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళాలు పాక్ గగనతలంలోనికి చొచ్చుకుని పోయి దాడులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదంపై తాజాగా పలు సంచలన విషయాలు బయటికొచ్చాయి. పాక్ ఆర్మీ చైనాతో కలిసి రూపొందించిన జెఎఫ్‌-17 విమానాన్ని మాత్రమే వైమానిక దాడులపరంగా వినియోగించామని, పాక్‌ మిలిటరీ అధికారప్రతినిధి తమవద్ద ఈ కార్యకలాపాల ఫుటేజి కూడా ఉందని వెల్లడించారు. అమెరికా ఎఫ్‌16 యుద్ధవిమానం కాదని, జెఎఫ్‌17 యుద్ధవిమానాలను వినియోగించామని వెల్లడించింది. భారత్‌వైమానికదళంతో జరిగిన గగనతలంయుద్ధంలో తాము వాడింది భారత్‌ చెపుతున్నట్లుగా ఎఫ్‌-16 కానేకాదని వాదించింది. అయితే పాకిస్తాన్‌ ఆర్మీ అధికారప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ మాట్లాడుతూ భారత్‌ యుద్ధవిమానాలు పాకిస్తాన్‌ గగనతలంలోనికి గతనెల 26వ తేదీ ప్రనవేశించాయని, అంతేకాకుండా కొన్ని బాంబులనుసైతం వదిలాయని, అయితే వాటివల్ల తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని వెల్లడించారు. ఎఐఎం-120 ఆమ్‌రామ్‌ క్షిపణులను ఎఫ్‌-16 విడుదలచేసిందని ఆధారాలు వెల్లడించాయి. ఇవన్నీ భారత్‌ప్రాంతంలోనే పడిపోయాయయని వెల్లడించారు. అమెరికా హోంశాఖ దీనిపై మరింత సమాచారం ఇవ్వాలని ఒప్పందానికి విరుద్ధంగా ఎఫ్‌-16 విమానాలను వినియోగించారా అన్న వివరాలను కోరింది.