తిరిగి సొంత గూటికి వచ్చినట్టు ఉంది : జీవిత

SMTV Desk 2019-04-01 17:32:27  ysrcp, ys jagan mohan reddy, actor rajashekhar, jeevitha

హైదరాబాద్‌ : ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్‌ఆర్‌సిపిలోకి ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్, భార్య జీవితా వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా జీవితా రాజశేర్‌ మీడియాతో మాట్లాడారు. ఏపి అభివృద్ధి చెందాలంటే జగన్‌ సీఎం కావాలన్నారు. గతంలో జగన్‌తో విభేదాలు ఉన్న మాట వాస్తమేనని, అప్పుడున్న జగన్‌ వేరు.. ఇప్పుడున్న జగన్‌ వేరు అని వారు పేర్కొన్నారు. మొత్తానికి వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందని.. తిరిగి సొంతగూటికి వచ్చినట్లు ఉందన్నారు. జగన్‌ జనం వెంటే నడుస్తున్నారని, ఆయన పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారని తెలిపారు.