మోదీ బయోపిక్‌కు లైన్ క్లియర్

SMTV Desk 2019-04-01 16:55:21  modi, modi biopic

ప్రధాని మోదీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా పీఎం నరేంద్ర మోదీ. ఈ సినిమా ఏప్రిల్ 5 వ తేదీన దేశవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ఫ్లాన్ చేసింది మూవీ యూనిట్. బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్…ప్రధాని మోదీ పాత్రలో నటించారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ రిలీజ్ కాకుండా అడ్డుకోవాలని కొంతమంది ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు. సినిమాను రిలీజ్ చేస్తే.. ఎన్నికలపై దాని ప్రభావం ఉంటుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు.. కేసును కొట్టేసింది. దీంతో పీఎం మోదీ సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. ఎన్నికలకు ముందు సినిమా రిలీజ్ కావడం శుభసూచకమని బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.