10వేల కిలోల గంజాయి పట్టివేత!

SMTV Desk 2019-04-01 16:20:39  uttarpradesh, drugs, drugs illegal transport

లక్నో, ఏప్రిల్ 1: ఉత్తరప్రదేశ్‌లో రోజురోజుకి గంజాయి రవాణా జోరుగా పెరుగుతూ పోతోంది. తాజాగా బారాబంకిలో భారీగా గంజాయి పట్టుబడింది. తనిఖీలు చేపట్టిన పోలీసులు రెండు లారీల్లో తరలిస్తున్న 10,400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. దీని విలువ కోట్లల్లో ఉంటుందంటున్నారు పోలీసులు.