బాలయ్యకు మెంటల్.. విజయసాయిరెడ్డి సంచలనం

SMTV Desk 2019-04-01 16:09:29  Vijaysai reddy ballayya

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీలు, నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల ప్రచారంతో పాటు సోషల్ మీడియాలో మాటల తూటాలు పేలుస్తున్నారు. ఘాటైన వ్యాఖ్యలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా ప్రత్యర్థులకు పంచ్‌లు విసురుతున్నారు. తాజాగా సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలయ్యకు మెంటల్ ఉందంటూ రెచ్చిపోయారు.

విజయసాయి తన ట్వీట్‌లో ‘తన ఇంట్లో బెల్లంకొండ సురేశ్ ను రివాల్వర్ తో కాల్చిన కేసులో బాలక్రిష్ణ జైలుకు పోకుండా అప్పటి నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు చౌదరి ఆయనకు మెంటల్ ఉందని సర్టిఫికేట్ ఇచ్చాడు. బెయిల్ దొరికేదాక రెండు నెలలు కరెంట్ షాక్ లిచ్చారు. వ్యాధి నయం కానట్టుంది. కార్యకర్తల్ని కొడుతున్నాడు’అంటూ ఘాటుగా స్పందించారు.