ఈవిఎంలపై నమ్మకం లేదు...బ్యాలెట్‌ పేపర్లే కావాలి : పసుపు రైతులు

SMTV Desk 2019-04-01 16:06:50  nijamabad formers, nominations, loksabha elections, evm, ballet papers

జగిత్యాల, ఏప్రిల్ 1: లోక్ సభ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్‌ ఎంపి స్థానానికి పసుపు రైతులు...ఎన్నికల్లో ఈవిఎంలు కాకుండా బ్యాలెట్‌ పేపర్‌ మాత్రమే వినియోగించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆ లోక్‌సభ స్థానానికి నామినేషన్లు వేసిన పసుపు రైతులంతా సోమవారం జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లో సమావేశమయ్యారు. ఈవిఎంలపై తమకు నమ్మకం లేదని రైతులు తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీలకు కాకుండా రైతులకే ఓటు వేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులను గెలిపిస్తే తాము అనుభవిస్తున్న సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతామని స్పష్టం చేశారు.