‘బొమ్మరిల్లు’ భాస్కర్‌తో అఖిల్‌ న్యూ ప్రాజెక్ట్

SMTV Desk 2019-04-01 16:00:52  akkineni akhil, akkineni nagarjuna, bommarillu movie, allu aravind, bommarillu bhaskar

హైదరాబాద్, ఏప్రిల్ 1: టాలీవుడ్ కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ ప్రారంభం నుండి పెద్ద పెద్ద వారితో కలిసి పని చేసినప్పటికీ ఇప్పటికి ఒక్క హిట్ కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. అయితే మరోవైపు అఖిల్‌కు ఓ పెద్ద హిట్ ఇవ్వాలని మెగా నిర్మాత అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌తో అఖిల్‌ను లాక్ చేశాడు అరవింద్. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ ప్రేమకథ తెరకెక్కనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం టాప్ మ్యూజిక్ డైరక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఏ సినిమాకు అయినా తన సంగీతంతో దేవీ శ్రీ ప్రసాద్ కచ్చితంగా హైప్ తీసుకురాగలడు. ఆయన పేరు ఉంటే సినిమా సగం హిట్ అని దర్శకనిర్మాతలు భావిస్తారు. ఈ నేపథ్యంలో అఖిల్ కోసం రాక్‌స్టార్‌ను ఎంచుకున్నారట అల్లు అరవింద్. దీనికి సంబంధించి ఆయనతో సంప్రదింపులు జరిగాయని, అఖిల్ కోసం దేవీ ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.