చైతూని కాపాడే భార్యగా సమంత

SMTV Desk 2019-04-01 14:00:00  samantha, majili trailer,

సమంత అక్కినేని, అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తోన్న నాలుగో సినిమా ‘మజిలీ’. ‘నిన్నుకోరి’ వంటి మంచి ప్రేమకథా చిత్రాన్ని రూపొందించిన శివనిర్వాణ దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారనే వార్త బయటికి రాగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. పెళ్లి తర్వాత చాలా సెలక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటున్న అక్కినేని సమంత... తన భర్త నాగచైతన్యతో కలిసి జోడిగా నటిస్తుండడంతో ‘మజిలీ’లో ఏదో కొత్తదనం ఉండి ఉంటుందనే గ్రహించారు ప్రేక్షకులు. తాజాగా విడుదలైన ‘మజిలీ’ ట్రైలర్ చూస్తుంటే... ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ‘మజిలీ’ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ సమంత అక్కినేని, నాగచైతన్య పాత్రలే. భార్య సంపాదన మీద బతికే బేవార్స్ భర్తగా నాగచైతన్య కనిపిస్తున్నాడు. మొదటి షాట్‌లోనే ఈ విషయాన్ని రివిల్ చేసి, తాను ఏం చెప్పాలనుకుంటున్నాడో క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు.


యంగ్ ఏజ్‌లో దివ్యాన్ష కౌశిక్‌తో ప్రేమాయణం నడుపుతాడు నాగచైతన్య. అది కాస్తా ఫెయిల్ కావడంతో ఆ పెయిన్‌తో భవిష్యత్తు మీద ఆశలు వదిలేసి, బేవర్స్‌గా మారతాడు. అతని గుండెల్లో దాగి ఉన్న బాధను అర్థం చేసుకున్న భార్య సమంత... ఉద్యోగం చేసి సంపాదిస్తూ భర్తను పోషిస్తూ ఉంటుంది. ఎవరెన్ని తిట్టినా పట్టించుకోకుండా భార్య సంపాదనతో తాగుతూ ఊగుతూ గడిపేసే నాగచైతన్యను సమంత అక్కినేని ఎలా మార్చి, గొప్ప వ్యక్తిగా మార్చింది అనే కథనే చూపించబోతున్నట్టు తెలుస్తోంది ట్రైలర్ చూస్తుంటే. మార్చి 31న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ వేడుక జరిపి ‘మజిలీ’ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఏప్రిల్ 5న విడుదల కాబోతున్న ‘మజిలీ’ టార్గెట్ ఫ్యామిలీ ఆడియోన్సే.