ఫోటో కోసం కూతురు ప్రాణాన్ని పణంగా పెట్టిన తండ్రి

SMTV Desk 2017-08-14 13:43:06  SAIBERIA, DAUGHTER, PHOTOGRAPHY, SOCIAL MEDIA, VIRAL VIDEO

సైబీరియా, ఆగస్ట్ 14 : ఏ తండ్రి అయిన తన కూతురు అందంగా కనిపించాలని కోరుకోవడం సహజం. కాని ఇక్కడ ఒక తండ్రి ఒక అడుగు ముందుకేసి తన కన్న కూతురి ప్రాణాన్ని పణంగా పెట్టి అందంగా ఫోటో తీయాలనుకొని జైలు పాలయ్యాడు. అసలు విషయం ఏంటంటే... సైబీరియాకు చెందిన రోమన్ అఫనసేవ్ (31) అనే ఒక తండ్రి తన కుమార్తెను ఒక ఎత్తైన భవనం నుంచి తల కిందులుగా వేలాడదీయడమే కాక ఒంటి చేత్తో పట్టుకొని ఉన్న ఫోటోను సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు. దీనిపై నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. అంతేకాకుండా మరో వీడియోను కూడా పోస్ట్ చేశాడు. బీఎండబ్ల్యూ స్పోర్ట్ కారు విండో బయట తన కుమార్తెను ఒంటి చేత్తో పట్టుకుని కారును మితిమీరిన వేగంతో నడిపించాడు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి నాయస్థానం ముందు హాజరుపరిచారు. ఈ చర్యలను పరిశీలించిన న్యాయస్థానం అతనికి మూడేళ్ళ జైలు శిక్షను విధించింది. అయితే ఈ చర్యలను తాను పూర్తి నియంత్రణలోనే చేశానని, దీని వల్ల తన కూతురు ప్రాణాలకు ఎటువంటి అపాయం లేదని అఫనసేవ్ చెప్పడం గమనార్హం.