వైసీపీలో చేరిన నటి హేమ, యాంకర్ శ్యామల

SMTV Desk 2019-04-01 11:49:53  ycp, anchor Shyamala, Hema

హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్, సినీ నటి శ్యామల తన భర్త నరసింహారెడ్డితో కలసి వైసీపీలో చేరారు. అనంతరం శ్యామల మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

జగన్ అన్న చేసే మంచి పనుల్లో పాలు పంచుకోవాలనే వైసీపీలో చేరినట్టు తెలిపారు. అన్నను చాలా కాలంగా పరిశీలిస్తున్నానని, ఆయన విధివిధానాలు, ఆయన చేస్తున్న మంచి పనులు తనకు ఎంతో నచ్చాయన్నారు. తనకు సపోర్ట్ గా తన భర్త కూడా వచ్చారని తెలిపారు.

మరో సినీ నటి హేమ కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో ఆమె సమైఖ్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఉపాధ్యక్షురాలిగా గెలుపొంది, సత్తా చాటారు.

కొద్దిసేపటి క్రితమే జీవిత, రాజశేఖర్ దంపతులు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.