షర్మిల ఉంగరాన్ని దొంగిలించిన దొంగను పట్టుకోండి

SMTV Desk 2019-04-01 11:45:06  sharmila, Ring, arrest

విజయవాడ: రెండు రోజుల క్రితం మంగళగిరిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ సోదరి షర్మిల ఉంగరాన్ని దొంగిలించిన దొంగను పట్టుకోవాలని పోలీసులను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆదేశించారు. తన ఉంగరం పోయిందని షర్మిల ఎటువంటి ఫిర్యాదూ చేయలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా దొంగను పట్టుకోవాలని గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు నుంచి సీసీఎస్ పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి.