CSK vs RR : టాస్ గెలిచి ఫీల్డింగ్ కు రాజస్తాన్

SMTV Desk 2019-03-31 20:36:37  csk vs rr, ipl 2019, dhoni, rahane

చెన్నై, మార్చ్ 31: ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్తాన్ రాయల్స్ మధ్య చెన్నై లోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తాజా సీజన్‌లో ఇప్పటి వరకూ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లాడిన చెన్నై జట్టు ఘన విజయాలతో మంచి జోరుమీదుండగా.. వరుసగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిన రాజస్థాన్ ఒత్తిడిలో బరిలోకి దిగుతోంది. చెన్నై జట్టులో ఓపెనర్లు షేన్ వాట్సన్, అంబటి రాయుడు ఇప్పటికే ఫామ్ అందుకోగా.. మిడిలార్డర్‌లో సురేశ్ రైనా, ధోనీ మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. బౌలింగ్‌లోనూ ఆ జట్టు సీనియర్లు, జూనియర్ల కలయికతో సమతూకంగా ఉంది. మరోవైపు రాజస్థాన్ జట్టులో ఓపెనర్ జోస్ బట్లర్, సంజు శాంసన్, కెప్టెన్ అజింక్య రహానె ఫామ్‌ అందుకున్నారు. ముఖ్యంగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గత శుక్రవారం శతకం బాదిన శాంసన్ అదే జోరుని కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

Rajasthan Royals (Playing XI): Ajinkya Rahane(c), Jos Buttler(w), Sanju Samson, Steven Smith, Ben Stokes, Rahul Tripathi, Krishnappa Gowtham, Jofra Archer, Jaydev Unadkat, Shreyas Gopal, Dhawal Kulkarni.

Chennai Super Kings (Playing XI): Shane Watson, Ambati Rayudu, Suresh Raina, Kedar Jadhav, MS Dhoni(w/c), Dwayne Bravo, Ravindra Jadeja, Mitchell Santner, Deepak Chahar, Shardul Thakur, Imran Tahir.