బైక్ ప్రియులకు బెనెల్లి కంపెనీ బంపర్ ఆఫర్

SMTV Desk 2019-03-31 20:34:28  Benelli TNT 302R,

మార్చ్ 31: బెనెల్లి కంపెనీ తన బైక్స్‌పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన కంపెనీ బైక్స్‌పై వడ్డీ రహిత రుణ సదుపాయం కల్పిస్తోంది. టీఎన్‌టీ 300, టీఎన్‌టీ 302 ఆర్ బైక్స్‌ను వడ్డీ లేకుండా రుణం తీసుకొని కొనుగోలు చేయవచ్చు. బైక్ ప్రియులకు ఇది నిజంగా శుభవార్తే. ఇది పరిమితకాల ఆఫర్. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ భాగస్వామ్యంతో కంపెనీ ఈ సౌకర్యాన్ని అందిస్తోంది. కస్టమర్లు బైక్ ఎక్స్‌షోరూమ్ ధరలో 80 శాతం వరకు మొత్తాన్ని రుణం రూపంలో పొందొచ్చు. అయితే 12 నెలలకు మాత్రమే ఈ వడ్డీ రహిత రుణ సదుపాయం ఉంటుంది. అంటే తీసుకున్న మొత్తాన్ని 12 ఈఎంఐల రూపంలో చెల్లించాలి. 12 నెలలు కాదు ఇంకా ఎక్కువ కాలానికి కూడా రుణం తీసుకోవచ్చు. అయితే దీనికి వడ్డీ వర్తిస్తుంది. అయితే వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంది. వడ్డీ రేటు 24 నెలలకు 2.5 శాతంగా, 36 నెలలకు 3.5 శాతంగా, 48 నెలలకు 4.5 శాతంగా, 60 నెలలకు 4.99 శాతంగా ఉంది. ఇకపోతే బెనెల్లి టీఎన్‌టీ 300, టీఎన్‌టీ 302 ఆర్ బైక్స్‌లో 300 సీసీ 2 సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. టీఎన్‌టీ 300 బైక్ ధర రూ.3.5 లక్షలుగా, టీఎన్‌టీ 302 ఆర్ ధర 3.7 లక్షలుగా ఉంది. ధరలన్నీ ఎక్స్‌షోరూమ్‌వి.