ట్రంప్ గారు మీకో దండం : హీరో నిఖిల్

SMTV Desk 2017-08-14 13:07:43  HERO NIKIL, NORTH KORIA, DONALD TRUMP, TWITTER

హైదరాబాద్, ఆగస్ట్ 14 : డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఉత్తర కొరియా దూకుడు చర్యలు మానుకోవాల౦టూ లేదంటే ఆ దేశంతో పోరాడేందుకు తమ సైన్యం సిద్దంగా ఉందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ట్విట్ పై యంగ్ హీరో నిఖిల్ స్పందిస్తూ... అణుయుద్ధం ప్రారంభించడానికి ట్విట్టర్ ను వేదికగా మార్చుకోవచ్చని తను అస్సలు ఊహించలేదని తెలిపారు. మాస్టర్ ట్రంప్ గారు.. మీకో దండం అని ట్విట్ చేసారు. కాగా నిఖిల్ ట్విట్ పై అభిమానులు "ట్రంప్ వల్ల మూడో ప్రపంచ యుద్ధం జరిగి మన౦దరి ఫోటోలకు దండలు పడతాయేమో"...? అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.