RX 135 మోడిఫైడ్ వెర్షన్‌ రిలీజ్

SMTV Desk 2019-03-31 19:21:54  RX 135, RX 100, YAMAHA

మార్చ్ 31: యమహా RX బైక్ అంటే నచ్చని వారు ఎవ్వరూ ఉండరు. ఒకప్పుడు ఒక ఊపు ఊపిన ఈ బైక్ ఇప్పటికీ రోడ్డ్లపై హళ్ చల్ చేస్తోంది. వేదాన్ష్ ఆటోమొబైల్స్ సంస్థ ఇటీవల యమహా ఆర్ఎక్స్ 135 బైక్‌లో మోడిఫైడ్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్లూ రంగులోని ఈ బైక్ అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. యమహా ఆర్ఎక్స్ 135 బైక్‌లో ఫ్యూయెల్ ట్యాంక్ పెయింటింగ్, పొడవైన సీటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బైక్ టైర్లను పెద్ద బటన్ల టైర్లతో రీప్లేస్ చేశారు. హ్యాండిల్‌బార్ అగ్రెసివ్ రైడింగ్‌కు అనువుగా ఉంది. బైక్ హెడ్‌ల్యాంప్, ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్‌లో ఎలాంటి మార్పు లేదు. ఇంజిన్‌కు నలుపు రంగు పెయింట్ వేశారు. బార్‌ఎండ్ మిర్రర్లు బైక్ అందాన్ని మరింత పెంచాయి. ఇకపోతే యమహా ఆర్ఎక్స్ 135లో 132 సీసీ ఇంజిన్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ మాగ్జిమమ్ పవర్ 14 హెచ్‌పీ. మాగ్జిమమ్ టార్క్12.25 ఎన్ఎం. ఐదు గేర్లు ఉంటాయి. బైక్ టాప్ స్పీడ్ గంటకు 110 కిలోమీటర్లు.