లేడీ ఓరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్

SMTV Desk 2019-03-31 18:55:45  Green signal, payal rajput

టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ మరో సినిమాకు సైన్ చేశారు. అంతేకాదు ఆ సినిమాను ఈరోజు లాంచే చేయడంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ హాట్ హీరోయిన్. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ ఈ సినిమా తర్వాత ఆమెకు బాగానే ఆఫర్లు వచ్చాయి.

అయితే వాటిలో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేశారు పాయల్. అదేమంటే.. ఆర్డీఎక్స్ . ఇది ఆ సినిమా టైటిల్. చాలా శక్తిమంతంగా ఉన్న ఈ సినిమా టైటిల్ స్టోరీ ఎలా ఉంటుందో చూడాలి. అలాగే.. కాసేపటి క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను శంకర్ భాను అనే కొత్త డైరెక్టర్ చేస్తున్నాడు. మరి ఆర్డీఎక్స్ అనే పవర్ఫుల్ టైటిల్ తో చేస్తున్న ఈ సినిమా కంటెంట్ పరంగా ఎలా ఉంటుందో చూడాలి.