అశ్విన్‌కి కృనాల్ పాండ్య‌ గుణపాఠం

SMTV Desk 2019-03-31 18:20:37  mumbai indians vs kxip, ipl 2019, ashwin, krunal pandya, mankading

మొహాలి, మార్చ్ 31: శనివారం సాయంత్రం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబయి ఇండియన్స్ మధ్య మొహాలి వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ స్పిన్నర్ కృనాల్ పాండ్య‌ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌కి పరోక్షంగా ‘క్రీడాస్ఫూర్తి’ని గుర్తు చేశాడు. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన పంజాబ్ జట్టు.. 9.3 ఓవర్లు ముగిసే సమయానికి 80/1తో నిలవగా.. క్రీజులో కేఎల్ రాహుల్ (18), మయాంక్ అగర్వాల్ (19) ఉన్నారు. ఈ దశలో బౌలింగ్ చేస్తున్న కృనాల్ పాండ్య‌.. బంతి విసరకముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని మయాంక్ క్రీజు వెలుపలికి వెళ్తూ కనిపించాడు. దీంతో.. మూడో బంతిని విసిరే ముందు బౌలింగ్‌ని నిలిపివేసిన కృనాల్ పాండ్య‌.. ‘మాన్కడింగ్’ రనౌట్‌‌పై హెచ్చరించాడు. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్.. బంతి విసిరిన తర్వాతే క్రీజు దాటడం కనిపించింది. క్రీడాస్ఫూర్తి అంటే ఇది.. అని ఇప్పుడు మళ్లీ అశ్విన్‌ను అభిమానులు ఏకిపారేస్తున్నారు. అంతేకాక అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న అశ్విన్‌.. తన స్థాయికి తగిన పని చేయలేదని మాజీ క్రికెటర్లు కొందరు అభిప్రాయపడ్డారు.