పవన్ ప్రచార సభలో తప్పిన పెను ప్రమాదం

SMTV Desk 2019-03-31 17:45:23  pawan kalyan, janasena party, loksabha elections, assembly elections, srikakulam

శ్రీకాకుళం, మార్చ్ 31: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు శ్రీకాకుళంలో ప్రచార సభ నిర్వహించారు. అయితే ఈ సభలో అపశృతి చోటుచేసుకుంది. సభా వేదిక వద్ద షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ప్రమాదవశాత్తు ఆ ప్రదేశంలో ఎవ్వరికీ ఏ హానీ జరగలేదు. దీంతో వేదిక నుంచి దిగి వాహనంపై ఎక్కి పవన్ ప్రసంగించారు. తన సభలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగిన సభలకు ఎక్కడా ఇబ్బంది కలగలేదని, తన సభలకు అడ్డుపడుతున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.