అడగకముందే 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చాం

SMTV Desk 2019-03-31 17:44:04  mp kavita, nijamabad, loksabha elections, trs, raitu bandhu scheme, 24hours power for formers

నిజామాబాద్‌, మార్చ్ 31: లోక్ సభ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్‌ టిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్ధి కవిత బోధన్‌ నియోజకవర్గంలోని నవీపేట్‌ మండలంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ జిల్లాకు న్యాయం జరిగిందని, గతంలో సాగునీటికి ఇబ్బందులు ఉండేవి, ఇప్పుడు అలాంటి సమస్యలు లేవు. అలాగే కాంగ్రెస్‌ హయాంలో నిజాంసాగర్‌ను నిర్లక్ష్యం చేశారు. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్నాం. రైతులు అడగక ముందే రైతులకు 24 గంటలకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. గతంలో సబ్‌స్టేషన్ల కోసం రైతులు చెప్పులరిగేలా తిరిగేవారు. ఇప్పుడు సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు సమస్యలు లేవు. మే 1వ తేదీ నుంచి పెన్షన్లు రెట్టింపు అవుతున్నాయి. 800 మంది వికలాంగ సోదరులకు అన్ని విధాలా అండగా ఉన్నాం. బీడీ కార్మికుల గురించి కాంగ్రెస్‌ నాయకులు ఆలోచించలేదు. తనకు చేతనైనంత అభివృద్ధి చేశాను. మన హక్కుల కోసం పార్లమెంట్‌లో పోరాడాను. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధే దేశవ్యాప్తంగా జరగాలి అని అన్నారు.