అంపైర్లకు నో పనిష్మెంట్!

SMTV Desk 2019-03-31 17:36:26  umpires, ipl 2019, rcb vs mi, virat kohli, dhoni

న్యూఢిల్లీ, మార్చ్ 31: గురువారం ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి 7 పరుగులు చేయాల్సి ఉండగా…మలింగ నోబాల్‌ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఫీల్డు అంపైర్‌ సుందరం రవి దాన్ని గమనించలేకపోయారు. అతనితో పాటు అంపైరింగ్‌ చేసిన నందన్‌ కూడా దాన్ని చూడలేదు. దీంతో బెంగుళూరు సారథి కోహ్లీ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్ల పొరపాట్లపై ఆక్షేపించాడు. అయితే అంపైర్‌పై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఐపిఎల్‌లో భారత అంపైర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో సత్వర చర్యలకు బిసిసిఐ వెనుకంజవేస్తోంది. తాజా ఐపిఎల్‌లో కేవలం 11మంది భారత అంపర్లు, ఆరుగురు విదేశీ అంపైర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. 56 మ్యాచ్‌లకు తక్కువ సంఖ్యలోనే అంపైర్లు అందుబాటులో ఉండటంతో చర్యలు తీసుకునే అవకాశం లేదు. కానీ…మ్యాచ్‌ రిఫరీ మను నాయర్‌ అంపైర్‌ రవికి నెగిటివ్‌ మార్క్‌ను వేశాడు.