ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైన నోకియా ఎక్స్71

SMTV Desk 2019-03-31 17:34:24  nokia, nokia x71, online marketing

మార్చ్ 31: ప్రముఖ నోకియా సంస్థ నుండి మార్కెట్లోకి వచ్చేందుకు సిద్దమయిన నోకియా ఎక్స్71 తాజాగా ఆన్‌లైన్‌లో ఫోన్ డీటైల్స్ లీకయ్యాయి. హెచ్ఎండీ గ్లోబల్ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ నోకియా ఎక్స్71 పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే అధికారికంగా ప్రకటించడం కంటే ముందే ఈ ఫోన్ ప్రత్యేకతలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. నోకియా ఎక్స్71 స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉండనుంది. అలాగే 6 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి. నోకియా ఎక్స్71లో ట్రిపుల్ రియర్ కెమెరా సహా పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ఉండే అవకాశముంది. అలాగే 6.22 అంగుళాల స్క్రీన్, 48 ఎంపీ కెమెరా ప్రత్యేకతలు ఉండొచ్చు. ఫోన్ పేరుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇతర మార్కెట్లలో ఈ ఫోన్ పేరు నోకియా 8.1 ప్లస్‌గా ఉండొచ్చని అంచనాలు వున్నాయి. అయితే తాజా నివేదికల ప్రకారం చూస్తే దీని పేరు నోకియా 6 (2019) లేదా నోకియా 6.2గా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.