ఉడిపిలో దర్శనమిచ్చిన గోల్డెన్‌ ట్రీ స్నేక్‌

SMTV Desk 2019-03-31 16:01:37  Udupi, Golden Tree Snake Sneaks Into Malpe Eatery,

బెంగళూరు, మార్చ్ 31: కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా మల్పెలో ఓ అరుదైన పాము ప్రత్యక్షమైంది. ఉడిపికి సమీపంలోని మల్పెలో ఓ హోటల్‌లో ఈ పాము దర్శనమిచ్చింది. ఆ పాము శరీరంపై ఎరుపు, నలుపు, తెలుపు మచ్చలు ఉన్నాయి. ఒటికన్నర మీటరు పొడవున్న ఈ పాము విషపూరితం కాదని, వీటిని స్థానికులు గోల్డెన్‌ ట్రీ స్నేక్‌ (కైసోపెలియా ఆర్నెట్‌)గా పిలుస్తారని పాముల పరిశోధకుడు గురురాజ్‌ మీడియాకు తెలిపారు. ఈ పాములు చెట్ల తొర్రల్లో జీవిస్తుంటాయని ఆయన వెల్లడించారు. ఈ పామును పట్టి అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టినట్టు హోటల్ యజమాని చెప్పారు.