రైలు ప్రయాణీకులకు శుభవార్త

SMTV Desk 2019-03-31 15:22:56  indian railways, free wifi, ralitell

న్యూఢిల్లీ, మార్చ్ 31: ఇండియన్‌ రైల్వేస్‌ రైలు ప్రయాణీకులకు మరో శుభవార్త తెలిపింది. ఇప్పటికే 1000రైల్వేస్టేషన్లలో ఉచిత హైస్పీడ్‌ వైఫై సౌకర్యం కలిపిస్తున్న ఇండియన్‌ రైల్వేస్‌ తాజాగా రైల్‌టెల్‌ ద్వారా మరిన్ని రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపింది. మినిస్ట్రీ ఆఫ్‌ రైల్వేస్‌ పరిధిలోని రైల్‌ టెల్‌ ఇప్పటికే వెయ్యి రైల్వేస్టేషన్లను ఉచిత వైఫై జోన్స్‌గా పరిగణించింది. 2016 జనవరిలో ముంబై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లో ఉచిత వైఫై సౌకర్యాన్ని తొలిసారి కల్పించారు. ఆ తర్వాత రెండు, మూడేళ్లలో వెయ్యిరైల్లేస్టేషన్లకు ఈ సౌకర్యం కల్పించారు. రైల్‌ వైర్‌ కింద ఇండియన్‌ రైల్వేస్‌ ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇప్పుడు సెంట్రల్‌ రైల్వే జోన్‌ పరిధిలోని రే రోడ్‌ రైల్వే స్టేషన్‌కు కూడా ఉచిత వైఫై సౌకర్యం కల్పించారు. దీంతో వెయ్యిస్టేషన్లకు ఈ సౌకర్యం కల్పించిన గొప్ప ఘనత ఇండియన్‌ రైల్వేస్‌కే దక్కుతుంది. రైల్వే స్టేషన్లను ఏ ఏ1, సి కేటగిరీలుగా విభజించారు. ఉచిత వైఫై 4,791బి, సి, డిఇ, ఈ కేటగిరీ రైల్వే స్టేషన్లకు మిగిలి ఉంది.