అమెజాన్ ఖాతాలో మహేష్ చిత్రం

SMTV Desk 2019-03-31 15:13:02  Amazon, maharshi,

సూప‌ర్ స్టార్ మహేష్ న‌టించిన తాజా చిత్రం `మ‌హ‌ర్షి`. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పూజా హెగ్డే ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన పోస్ట‌ర్ల‌లో మ‌హేష్ – పూజా హెగ్డే- న‌రేష్ కాలేజ్ లో క్లాస్ మేట్స్ బెంచ్ మేట్స్ అని అర్థ‌మైంది. స్నేహం కాన్సెప్టుపై తెర‌కెక్కుతున్న అరుదైన చిత్ర‌మిది. అలాగే రైతు స‌మ‌స్య‌లు, స్థానిక రాజ‌కీయాల‌పైనా ఆస‌క్తిక‌ర‌మైన టాపిక్ ఈ చిత్రంలో ఉండ‌బోతోంద‌ని ఇదివ‌ర‌కూ అందిన లీకుల ప్ర‌కారం తెలుస్తోంది.

`మ‌హ‌ర్షి` చిత్రాన్ని మే 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు దిల్ రాజు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ మ‌హ‌ర్షి ప్రీ రిలీజ్ బిజినెస్ గురించిన‌ ఆస‌క్తిక‌ర‌మైన స‌మాచారం ఏదీ లేదు. ఓవ‌ర్సీస్ బిజినెస్ ఇంకా పూర్తి కాక‌పోవ‌డంపైనా గ‌త కొంత‌కాలంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. నిర్మాత‌లు 18 కోట్ల మేర డిమాండ్ చేస్తుంటే ఓవ‌ర్సీస్ బ‌య్య‌ర్ ఎవ‌రూ కొనేందుకు ముందుకు రావ‌డం లేద‌ని ప్ర‌చార‌మైంది. ఇదివ‌ర‌కూ 12కోట్ల వ‌ర‌కూ డీల్ మాట్లాడినా.. నిర్మాత‌ల వైపు నుంచి త‌గ్గ‌లేద‌ని వార్త‌లొచ్చాయి. తాజాగా మ‌హ‌ర్షి డిజిట‌ల్ రైట్స్ కి సంబంధించిన అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాని ప్ర‌ఖ్యాత డిజిట‌ల్ స్ట్రీమింగ్ దిగ్గ‌జం అమెజాన్ కు 11కోట్ల‌కు విక్ర‌యించార‌ని తెలుస్తోంది. ఇదివ‌ర‌కూ మ‌హేష్ `భ‌ర‌త్ అనే నేను` చిత్రాన్ని అమెజాన్ సొంతం చేసుకుంది. 10కోట్ల మేర డీల్ సాగింద‌ని అప్ప‌ట్లో ప్ర‌చార‌మైంది. అలాగే చ‌ర‌ణ్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `రంగ‌స్థ‌లం` డిజిట‌ల్ రైట్స్ ను 18 కోట్లు చెల్లించి అమెజాన్ ఛేజిక్కించుకుంది. అలాగే మొన్న సంక్రాంతి సినిమాల్లో ఎఫ్ 2, విన‌య విధేయ రామ చిత్రాల్ని అమెజాన్ భారీ మొత్తాలు వెచ్చించి త‌న ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే.