భయపెట్టేందుకు సిద్ధమైన జాన్వీ

SMTV Desk 2019-03-31 13:49:37  Jahnvi kapoor,

తన తల్లి శ్రీదేవీలాగే నటిగా తనలోని అన్ని కోణాలను బయటపెట్టాలనుకుంటోంది ‘ధడక్’ బ్యూటీ జాన్వీ కపూర్. లవ్ స్టోరీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. కేవలం గ్లామర్‌ పాత్రలకు పరిమితం అవ్వకూడదని ఈ అమ్మడు భావిస్తోంది. ఈ నేపథ్యంలో విభిన్న కథలను ఎంచుకుంటోన్న జాన్వీ.. తాజాగా ఓ హారర్ చిత్రానికి ఓకే చెప్పింది.

గతేడాది బాలీవుడ్‌లో విజయం సాధించిన చిత్రాలలో ‘స్త్రీ’ ఒకటి. రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ చిత్రాన్ని నిర్మించిన దినేజ్ విజయ్, రాజ్ కుమార్ రావుతోనే మరో హారర్ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ‘రుహి ఆప్జా’ పేరుతో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ ఎంపికైంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటనను ఇచ్చేసింది. కొత్త దర్శకుడు హార్దిక్ మెహతా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో జాన్వీ దెయ్యం పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో వరుణ్ శర్మ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది మార్చి 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.