ఇంద్రగంటితో ‘వ్యూహం’

SMTV Desk 2019-03-31 12:44:04  indrakanti, nani,

ప్రస్తుతం ‘జెర్సీ’ విడుదల కోసం ఎదురుచూస్తున్న నాని మరోవైపు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ షూటింగ్ చకాచకా కానిచ్చేస్తున్నారు. దసరా పండుగకే ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాన్ని విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకోవడంతో చాలా బిజీ షెడ్యూల్స్‌తో షూటింగ్ చేస్తున్నారు. వీటి తర్వాత నాని తనకు మొదటి బ్రేక్‌నిచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అష్టాచమ్మా, జెంటిల్‌మెన్ చిత్రాలు రెండూ సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు ఇంద్రగంటితో నాని మూడవ సినిమా చేస్తున్నారు. ఇందులో నానీతో పాటు మరో హీరో కూడా ఉంటారు. దుల్కర్ సల్మాన్ కోసం ఇంద్రగంటి చాలా ప్రయత్నించారని గతంలో వార్తలు వచ్చాయి.

కానీ చివరికి మరో హీరోగా సుధీర్‌బాబు ఖరారయ్యారు. ఇక నాని, సుధీర్‌బాబు కలిసి చేస్తున్న తొలి సినిమా ఇది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దీనికి టైటిల్ కూడా ఫైనల్ అయిందట. ‘వ్యూహం’ అని ఫిలింఛాంబర్‌లో రిజిస్టర్ అయినట్టుగా తెలిసింది. ఈ టైటిల్ చూస్తుంటే ఇదేదో థ్రిల్లర్ జోనర్ మూవీలా అనిపిస్తోంది. ‘జెంటిల్‌మెన్’ను కూడా ఇదే తరహాలో తీర్చిదిద్ది ఇంద్రగంటి మంచి ఫలితాన్ని అందుకున్నారు. ఇక ‘సమ్మోహనం’తో సుధీర్‌బాబుకు హిట్ ఇచ్చారు ఇంద్రగంటి. ఇలా అన్ని రకాలుగా కలిసి రావడం ‘వ్యూహం’కు ప్లస్ అయ్యేలా ఉంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రావచ్చు.