‘పవర్ పేట’ గా వస్తున్న నితిన్

SMTV Desk 2019-03-31 12:41:10  Power peta, nithin,

నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ సినిమా చేస్తున్నాడు. అలాగే చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా ఉంది. వీటితో పాటు దర్శకుడు కృష్ణచైతన్యతో ఓ వైవిధ్యమైన సినిమా చేయబోతున్నాడు. మూడు భాగాలుగా వచ్చే ఈ సినిమా తొలి భాగానికి ‘పవర్ పేట’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు తెలిసింది. నితిన్‌కు పవన్‌కళ్యాణ్ అంటే వీరాభిమానం. అందుకే పవర్‌స్టార్ గుర్తుకు వచ్చేలా ‘పవర్ పేట’ అని టైటిల్‌ను ఖరారు చేయడం విశేషం. భీష్మ, చంద్రశేఖర్ యేలేటి చిత్రాలు పూర్తి చేసిన తర్వాత ‘పవర్‌పేట’ చిత్రం చేస్తాడు నితిన్. ఈ సినిమాను నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ఠ మూవీస్ నిర్మిస్తుంది.