బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్

SMTV Desk 2019-03-31 12:38:14  rcb, srh

రాజస్థాన్ రాయల్స్‌పై భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి తొలి విజయాన్ని అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. మరోవైపు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిన బెంగళూరు తొలి విజయం కోసం తహతహలాడుతోంది. హైదరాబాద్‌పై గెలిచి ఐపిఎల్ వేటకు శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. హైదరాబాద్‌లో డేవిడ్ వార్నర్, బెంగళూరులో ఎబి.డివిలియర్స్ భీకర ఫామ్‌లో ఉన్నారు. ఇద్దరు ఇప్పటి వరకు ఆడిన రెండు మా ్యచుల్లోనూ సత్తా చాటారు. ఈసారి కూడా ఇరు జ ట్లు వీరిపైనే భారీ ఆశలు పెట్టుకున్నాయి. సొంత గడ్డపై జరుగుతున్న పోరులో హైదరాబాద్ గెలుపే లక్షంగా పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రెండు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. అయితే బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్ కాస్త మెరుగైన ఆటను కనబరుస్తుందనే చెప్పాలి. ఇప్పటి కే తొలి విజయం అందుకోవడంతో ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.