వెబ్‌ సిరీస్‌ను నిర్మించేందుకు ప్లాన్‌

SMTV Desk 2019-03-31 12:22:17  vijay devarakonda,

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ బుల్లితెరపై అస్సలు నటించనని ప్రకటించారు. వెబ్ సిరీస్ తో డిజిటల్ మార్కెట్ లో విస్తృతంగా ప్రచారం పొందిన ఈ విభాగంలో నటించే సమస్యే లేదన తెలిపారు. కానీ భవిష్యత్తులో వెబ్‌ సిరీస్‌ను నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా వెల్లడించారు విజయ్ దేవరకొండ. తాజాగా ముంబైలోని ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్న విజయ్‌ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

కాగా విజయ్‌ హీరోగా తెరకెక్కిన డియర్‌ కామ్రేడ్‌ త్వరలో రిలీజ్‌ కానున్న విషయం తెలిసిందే. అదేవిధంగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా మరో రొమాంటిక్‌ మూవీ షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే.