బీఎస్‌ఎన్ఎల్ మరో బంపర్ ఆఫర్... స్పీడ్ లిమిట్ మాత్రం తగ్గదు.!

SMTV Desk 2017-08-14 10:30:59  BSNL, DATA PLANS, NO SPEED LIMIT

న్యూఢిల్లీ, ఆగస్ట్ 14 : బీఎస్‌ఎన్ఎల్ తమ వినియోగదారుల కోసం మరో బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. ప్రస్తుతం టెలికాం వ్యవస్థలో ఉన్న పోటీని తట్టుకునే ఉద్దేశంతో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ. 1099తో అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్ ప్రకటించింది. దీనిలో భాగంగా ఎటువంటి స్పీడ్ లిమిట్ లేకుండా అపరిమితంగా డేటాను వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా నెలరోజుల పాటు ఆంక్షలు లేకుండా పూర్తి స్వేచ్ఛగా డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇతర కంపెనీలు ఇలాంటి ఆఫర్లే ఇస్తున్నా కొంత డేటా వినియోగించిన తర్వాత స్పీడ్ తగ్గిపోతుంది. అయితే తాజాగా బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన ఈ ఆఫర్‌లో వేగం నిబంధన లేదు.