పంజాబ్‌ 8 వికెట్ల తేడాతో విజయం

SMTV Desk 2019-03-30 20:44:20  punjab, mumbai, kl rahul

మొహాలీ : మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో కింగ్స్ ఏలెవన్ పంజాబ్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముంబయి ఇచ్చిన 177 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లకే ఛేదించడం విశేషం. కాగా కేఎల్‌ రాహుల్‌ (71; 57 బంతుల్లో 6×4, 1×6) అజేయంగా నిలవగా డేవిడ్‌ మిల్లర్‌ (15) అతడికి అండగా నిలిచాడు