ప్రియాంక చోప్రా విడాకులు తీసుకోనుందా

SMTV Desk 2019-03-30 19:10:58  priyanka, nick,

ప్రియాంక చోప్రా పై అప్పుడే విడాకుల కథనాలు వస్తున్నాయి బ్రిటన్ లో . తాజాగా ఓ బ్రిటన్ మీడియా లో ప్రియాంక చోప్రా – నిక్ జోనాస్ ల విడాకుల గురించి , గొడవల గురించి కథనాలు వెలువడ్డాయి దాంతో ఆ కథనాలు ఇండియాలో సంచలనం సృష్టిస్తున్నాయి . గత ఏడాది డిసెంబర్ లో ప్రియాంక చోప్రా – నిక్ జోనాస్ లు పెళ్లి చేసుకున్నారు . అంటే పెళ్లి జరిగి సరిగ్గా నాలుగు నెలలు అన్నమాట .


అయితే అంతకుముందు నుండే కలిసి ఉంటున్నారు ఈ ఇద్దరూ . ఇక తాజా విషయానికి వస్తే ప్రియాంక వ్యవహార శైలి మొదట్లో పెద్దగా అభ్యంతర పెట్టలేదట నిక్ కుటుంబ సభ్యులు . ఎందుకంటే అప్పుడు కొత్త పెళ్లికూతురు కాబట్టి , కానీ ఇపుడు కాదు కదా ! కానీ మొదట్లో ప్రియాంక వ్యవహారశైలి పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం నిక్ – ప్రియాంక చోప్రా ల మధ్య గొడవలు జరుగుతున్నాయట . ఇదే ధోరణి సాగితే త్వరలోనే విడాకులు తీసుకోవడం ఖాయమని అంటున్నారట . ఏమో ! పెళ్లి జరిగి నాలుగు నెలలు కూడా నిండకుండానే ఈ విడాకుల గోలేంట్రా బాబూ !