మన్మధుడు 2 లో వెన్నెల కిషోర్ పాత్ర

SMTV Desk 2019-03-30 18:53:20  Manmadhudu 2, vennela kishore

అక్కినేని నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న చిత్రం ‘మన్మధుడు 2’. ఈ సినిమా 2002లో వచ్చిన మన్మధుడు చిత్రానికి సీక్వెల్. అప్పట్లో ఈ సినిమా అతి పెద్ద హిట్. ముఖ్యంగా బ్రహ్మానందం సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. అంతేకాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగులు కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి.

ఇకపోతే తాజా సమాచారం ప్రకారం ‘మన్మధుడు 2’ లో బ్రహ్మానందం పాత్రను కమెడియన్ వెన్నెల కిషోర్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక వెన్నెల కిషోర్ కు కమెడియన్ గా మంచి పేరు ఉంది. అయితే లవంగం పాత్రలో వెన్నెల కిషోర్ ఏ మేరకు మెప్పిస్తాడో.. రాహుల్ రవీంద్రన్ రాసిన డైలాగులు త్రివిక్రమ్ ను తలపిస్తాయో లేదో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ యూరోప్ లో ప్రారంభం అవుతుంది.