జర్నీ ఆఫ్ జెర్సీ.. మేకింగ్ వీడియో..!

SMTV Desk 2019-03-30 18:45:08  journey of jersey,

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా జెర్సీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు చిత్రయూనిట్. క్రికెటర్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా కోసం నాని 70 రోజులు క్రికెట్ నేర్చుకున్నాడు.ఏప్రిల్ 19న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం 250 మంది కాస్టింగ్ అండ్ క్రూ పనిచేయడం జరిగింది. 5 డొమెస్టిక్ స్టేడియం లలో ఈ సినిమా షూట్ చేశారు. అంతేకాదు 130 మంది క్రికెట్ తెలిసిన వాళ్లను ఈ సినిమాలో వివిధ పాత్రల కోసం తీసుకున్నారు. నాని అండ్ టీం 18 మంది పర్యవేక్షణలో ఈ సినిమా తెరకెక్కింది. మొత్తానికి జెర్సీ వెనుక చాలా పెద్ద కథ ఉందన్నమాట. ఈ సినిమా మేకింగ్ వీడియో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది.