‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చూసిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఉండవల్లి

SMTV Desk 2019-03-30 18:44:08  undavalli ,

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత విశేషాలతో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఏపీ మినహా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో సినిమాను చూసేందుకు ఏపీ నుంచి పలువురు తెలంగాణకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైదరాబాద్‌కు వచ్చి సినిమాను చూశారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు గీత రచయితగా పనిచేసిన సిరా శ్రీ, ఎమెస్కో అధినేత విజయ్ కుమార్‌లతో కలిసి ఉండవల్లి సినిమా చూశారు. ఈ విషయాన్ని సిరా శ్రీ సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘‘రాజమండ్రిలో రిలీజ్ అవ్వలేదని హైదరాబాద్ కి వచ్చి మరీ సినిమా చూసిన శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్. చిత్రంలో ఎమెస్కో అధినేత శ్రీ విజయకుమార్’’ అంటూ సిరా శ్రీ కామెంట్ పెట్టారు.