టీఆర్ఎస్ సభలో జనం కొరత

SMTV Desk 2019-03-30 18:40:59  trs, kcr,

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగ సభకు కేసీఆర్ గైర్హాజరవడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిన్న సాయంత్రం మిర్యాలగూడలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన కేసీఆర్ అక్కడి నుంచి హైదరాబాద్ బయల్దేరి వచ్చారు. షెడ్యూల్ ప్రకారం 5.30 గంటలకు ఎల్బీ స్టేడియంలో సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయి సభను నిర్వహించాల్సి ఉంది. కానీ నిర్ణీత టైంలోగా కేసీఆర్ హైదరాబాద్ రాలేకపోయారు. అందుకే ఆయన సభకి హాజరు కాలేదు, కేసీఆర్ పాల్గొనకపోవడంతో ఆయన లేకుండానే మంత్రులు సభను నిర్వహించారు.

సీఎం రావట్లేదని తెలియడంతో జనం నెమ్మదిగా స్టేడియం నుంచి వెళ్లిపోయారు. ఈ సభలో హోం మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. చివరి నిమిషంలో కేసీఆర్ రాకపోవడం చర్చకు దారి తీసింది. సభకు ఆశించిన స్థాయిలో జనం రాకపోవడంతోనే సీఎం కేసీఆర్ ఈ సభకు హాజరు కాలేదని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. జనం పలుచగా ఉండటంతో బాధ్యులపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా ప్రచారం జరిగింది. లోక్ సభ ఎన్నికల ప్రకటన వెలువడ్డాక హైదరాబాద్‌లో టీఆర్ఎస్ నిర్వహించిన తొలి సభ ఇదే కావడం అది ఇలా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది