తమిళనాడులో ఐటీరైడ్స్

SMTV Desk 2019-03-30 18:28:35  tamilnadu, it raids

తమిళనాడులో ఐటీరైడ్స్ డీఎంకే నేతల్లో వణుకుపుట్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా డీఎంకే నేతల ఇళ్లల్లో వరుస దాడులు చేస్తోన్న ఐటీ.. తాజాగా.. ఆ పార్టీ ట్రెజరరీ, మాజీ మంత్రి దురై మురుగన్ నివాసాల్లో కూడా సోదాలు చేస్తోంది. ఏక కాలంలో ఆరుగురు సభ్యుల బృందం దురై నివాసాలలో తనిఖీలు నిర్వహించింది. ఐటీ రైడ్స్ సమాచారం తెలుసుకున్న డీఎంకే నేతలు, కార్యకర్తలు దురై ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నారు. ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా ఉంది.

గత కొంతకాలంగా తమ పార్టీ నేతలనే ఐటీ టార్గెట్ చేసుకుని దాడులు చేస్తోందంటూ మండిపడుతున్నారు డీఎంకే నాయకులు. అధికార పార్టీ అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ తమపై దాడులు చేపిస్తోందంటూ ఆరోపించారు.