మహేష్ సినిమాకు బిజినెస్ కష్టాలా?

SMTV Desk 2019-03-30 18:25:22  Maharshii,

సూపర్ స్టార్ మహేష్ సినిమాకు బిజినెస్ కష్టాలా ఏంటి ఇది నిజమేనా అని షాక్ అవ్వొచ్చు. ఈమధ్య ఓవర్సీస్ లో తెలుగు సినిమాల ఫలితాలకు డీలా పడ్డ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ స్టార్ సినిమాలను కొనాలంటే వెనుకడుగు వేస్తున్నారు. సంక్రాంతికి వచ్చిన వినయ విధేయ రామా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కు పెద్ద షాక్ ఇచ్చింది. ఆ ఎఫెక్ట్ మహేష్ బాబు మహర్షి మీద పడ్డది. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా యూఎస్ రైట్స్ 18 కోట్లకు ఫిక్స్ చేశారట. అయితే అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం 12 కోట్లు వరకు వచ్చారట. మహర్షి నిర్మాతలను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ డైలమాలో పడేసింది. సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. మే 9న రిలీజ్ అవనున్న మహేష్ మహర్షి ఫైనల్ గా యూఎస్ లో ఎంతకు డీల్ క్లోజ్ అవుతుందో చూడాలి. తెలుగు రెండు రాష్ట్రాల్లో మాత్రం సినిమా భారీ రేంజ్ లో బిజినెస్ చేస్తుంది.