సమంత నటనకు ప్రశంసలు

SMTV Desk 2019-03-30 13:00:15  Samantha,

పెళ్లి అయిన తర్వాత సమంత సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తుందనే విషయం తెలిసిందే. అన్ని సినిమాలకు ఓకే చెప్పకుండా నటనకు ఆస్కారం ఉన్న సినిమాలను మాత్రమే ఆమె చేస్తోంది. అయితే తమిళంలో ఆమె నటించిన ‘సూపర్ డీలక్స్’ అనే చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సమంత వ్యాంప్ పాత్రలో నటించడం చర్చనీయాంశం అయింది. చాలా విభిన్నమైన పాత్ర కావడంతో పాటు నటనా ప్రతిభను చూపించే పాత్ర కావడంతో ఈ సినిమాలో నటించానని ఇటీవల సమంత పేర్కొంది. ఈ చిత్రంలో ఈ కథానాయిక నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి.

సోషల్ మీడియాలో నెటిజన్లు సమంతను ప్రశంసిస్తూ కెరీర్‌లో బెస్ట్ పర్‌ఫార్మెన్స్‌ను ఇచ్చిందని కామెంట్ చేస్తున్నారు. అయితే వ్యాంప్ పాత్ర చేయడం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇక నాగచైతన్య, సమంత జోడీగా నటించిన ‘మజిలీ’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పెళ్లయిన తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రమిది.